Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారత్ కు అనుకూలంగా స్పందించిన ట్రంప్.. పాక్ కు చురకలు

భారత్ కూడా ఉగ్రవాద బాధిత దేశమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ఆయన రియాద్ లోని అరబ్ ఇస్లామిక్-యూఎస్ సదస్సులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు  చేశారు. అమెరికా నుంచి భారత్ వరకు, ఆస్ట్రేలియా నుంచి రష్యా వరకు అన్ని దేశాలూ ఉగ్రవాద బాధితులేనని ఆయన అన్నారు. ఈ దేశాలన్నీ పలుసార్లు ఉగ్రదాడుల బారిన పడ్డాయని తెలిపారు. ఏ దేశం కూడా తమ భూభాగంలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించకూడదని పరోక్షంగా పాకిస్థాన్ ను ఉద్దేశించి అన్నారు. 

More Telugu News